Andhra Pradesh: విద్యుత్ ధరలు ప్రతి గంటా మారతాయి: ఏపీ విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్
- ఆ ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు
- ఏపీ సర్కారు 18.37 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తోంది
- యూనిట్ విద్యుత్‌ను రూ.4.46 కు కొనుగోలు
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ధరల పెంపుపై ఏపీ విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ వివరణ ఇచ్చారు. ఈ రోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆ ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవని స్పష్టం చేశారు. విద్యుత్ రేట్లలో ప్రతి గంటకూ మార్పు ఉంటుందని తెలిపారు. ఏపీ సర్కారు 18.37 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.
యూనిట్ విద్యుత్‌ను రూ.4.46 కు కొనుగోలు చేసి రైతులకు ఇస్తోందని తెలిపారు. పగటి పూట సోలార్ విద్యుత్ ఇవ్వాలన్న ఆశయంతో 10 వేల మెగావాట్లు కొనుగోలు చేస్తున్నామని ఆయన వివరించారు. అలాగే, టెండర్లు పిలిచి యూనిట్ రూ.2.49కు విద్యుత్ కొనుగోళ్లు జరుపుతున్నామని చెప్పారు.