Balakrishna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Krish to direct Balakrishna for Geetha Arts film
  • బాలకృష్ణ సినిమాకి క్రిష్ దర్శకత్వం?
  • కమలహాసన్ 'విక్రమ్' అప్ డేట్స్
  • వెంకీ, రానాల సినిమాలు ఓటీటీకే!    
*  నందమూరి బాలకృష్ణ హీరోగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి క్రిష్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఈ విషయంలో ప్రస్తుతం క్రిష్ తో సంప్రదింపులు జరుగుతున్నాయట.
*  విలక్షణ నటుడు కమలహాసన్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తాజాగా 'విక్రమ్' చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ఫస్ట్ గ్లిమ్ప్స్ ను కమల్ బర్త్ డే సందర్భంగా ఆదివారం (నవంబర్ 7) సాయంకాలం విడుదల చేస్తారు. ఈ చిత్రం ఆడియో హక్కులను సోనీ మ్యూజిక్ సొంతం చేసుకుంది. ఇక చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
*  వెంకటేశ్ నటించిన 'దృశ్యం 2', రానా నటించిన 'విరాటపర్వం' చిత్రాలను ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత సురేశ్ బాబు వెల్లడించారు. వీటిలో 'విరాటపర్వం' నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదల చేయనున్నారు. 'దృశ్యం 2' చిత్రానికి సంబంధించి ఓటీటీ పార్ట్ నర్ లతో సంప్రదింపులు జరుగుతున్నాయి.
Balakrishna
Krish
Kamala hasan
Rana Daggubati
Venkatesh Daggubati

More Telugu News