Junior NTR: జూనియర్‌ ఎన్టీఆర్‌ కుడి చేతి వేలికి సర్జరీ.. ఇంట్లో జిమ్‌ చేస్తుండగా గాయం?

ntr gos under the knife

  • నాలుగు రోజుల క్రితమే  మైనర్ సర్జరీ
  • కొన్ని రోజుల పాటు జాగ్ర‌త్త‌లు
  • నిన్నటి ఫొటోలోనూ చేతికి బ్యాండేజీ

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇటీవల తన ఇంటి జిమ్‌లో వ్యాయామాలు చేస్తుండగా ఆయన కుడిచేతి వేలుకి గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో నాలుగు రోజుల క్రితమే ఆయ‌న మైనర్ సర్జరీ చేయించుకున్నార‌ని సమాచారం. కొన్ని రోజుల పాటు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆయ‌న‌కు వైద్యులు సూచించారు. నిన్న ఎన్టీఆర్ త‌న కుమారుల‌తో కలిసి దిగిన ఫొటోలోనూ కుడి చేతికి బ్యాండేజీతో కనిపించాడు.

ఇక, ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్' విడుదలకు రెడీ అవుతోంది. త్వరలో కొరటాల శివ దర్శ‌క‌త్వంలో రూపొందే చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నారు. దీంతో పాటు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో మరో సినిమాలోనూ న‌టించాల్సి ఉంది. మరోపక్క, 'ఎవరు మీలో కోటీశ్వరుడు' షో కూడా చేస్తున్నాడు.

Junior NTR
Tollywood
RRR
  • Loading...

More Telugu News