Pawan Kalyan: మ‌తి త‌ప్పిన పాల‌కుల దాష్టీకం నుంచి కాపాడాల‌ని ఆదిశ‌క్తిని ప్రార్థిస్తున్నా: ప‌వ‌న్ క‌ల్యాణ్

pawan kalyan wishes

  • ప్ర‌జ‌ల‌కు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు
  • దీపం ప‌ర‌బ్ర‌హ్మ స్వ‌రూపం
  • అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తు
  • అమావాస్యనాడు జరుపుకొనే ఈ పండుగ శుభాకాంక్ష‌లు

మ‌తి త‌ప్పిన పాల‌కుల దాష్టీకాల నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించాల‌ని ఈ దివ్వెల పండుగ సంద‌ర్భంగా ఆ ఆదిశ‌క్తిని ప్రార్థిస్తున్నాన‌ని జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ప్ర‌జ‌ల‌కు ఆయ‌న దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు. 'దీపం ప‌ర‌బ్ర‌హ్మ స్వ‌రూపం. అంధకారం నుంచి వెలుగు వైపు నడిపించేది దీపం అని భావిస్తాం. అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకొనే ఈ పండుగ తరుణాన నా ప‌క్షాన‌, జనసేన శ్రేణుల ప‌క్షాన దీపావ‌ళి శుభాకాంక్షలు' అని ప‌వన్ అన్నారు.

పర్యావరణానికి నష్టం కలిగించకుండా ఈ దీపాల పండగను జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నానని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. కాంతులను వెదజల్లే దీపాలు, విద్యుల్లతలతో ఇళ్లను అలంకరించుకుందామ‌ని చెప్పారు. ఎక్కువ హానికరం కాని బాణ‌సంచాతో దీపావళి జరుపుకోవడం సర్వదా శ్రేయస్కరమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. కంటికి హాని చేసే వాటికి దూరంగా ఉందామ‌ని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News