Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సినిమా నుంచి మైక్ టైసన్ ఫస్ట్ లుక్ విడుదల

Mike Tyson first look in Liger Movie

  • విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో 'లైగర్' మూవీ
  • కీలక పాత్రను పోషించిన ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ మాజీ ఛాంపియన్
  • విజయ్ సరసన నటిస్తున్న అనన్య పాండే

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో 'లైగర్' మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. మరోవైపు ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ ఛాంపియన్ మైక్ టైసన్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. టైసన్ ఉండటంతో ఈ చిత్రానికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది.  ఈ క్రమంలో మైక్ టైసన్ కు చెందిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ దీపావళి పర్వదినం సందర్భంగా ఈరోజు విడుదల చేసింది. పిడికిలి బిగించి సింహనాదం చేస్తున్న టైసన్ ఫొటో ఆకట్టుకుంటోంది.

'లైగర్' చిత్రాన్ని పూరి జగన్నాథ్ కు చెందిన పూరి కనెక్ట్, బాలీవుడ్ నిర్మాత కరణ్ జొహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ చిత్రాలను థాయిలాండ్ కు చెందిన స్టంట్ డైరెక్టర్ కెచ్చా కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News