Rajanikanth: రజనీ సార్ అలా చేయడంతో షాక్ అయ్యాను: 'పెద్దన్న' డైరెక్టర్!

Peddanna movie update

  • 'పెద్దన్న' ఛాన్స్ అలా వచ్చింది 
  • రజనీ సార్ సెట్లో మెచ్చుకునేవారు
  • సినిమా మొత్తం చూసి ఖుషీ అయ్యారు 
  • అయన ప్రేమను మరిచిపోలేనన్న శివ

ఈ దీపావళికి ఇటు తెలుగులోను .. అటు తమిళంలోను పెద్ద సినిమా 'పెద్దన్న'నే. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుంది. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, తమిళ .. తెలుగు భాషల్లో ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు శివ మాట్లాడాడు.

'విశ్వాసం' సినిమా హిట్ అయిన తరువాత రజనీ సార్ నన్ను పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. 'నాతో ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నావ్?' అని ఆయన అడిగితే, 'అది మీ సినిమాలానే ఉంటుంది సార్' అన్నాను. అందుకు ఆయన పెద్దగా నవ్వేశారు. ఎమోషన్ ప్రధానంగా చేద్దాం సార్ అంటే 'ఓకే ప్రొసీడ్ ..' అన్నారు.

అలా సినిమా షూటింగు మొదలైంది. ఏదైనా షాట్ నేను బాగా తీస్తే సెట్లోనే ఆయన నన్ను అభినందించేవారు. శివ అదరగొట్టేస్తున్నాడని అందరితో గొప్పగా చెప్పేవారు. ఈ సినిమా మొత్తం చూసిన ఆయన, బయటికి వస్తూనే ఆనందంతో నన్ను ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకున్నారు. అంతటి సూపర్ స్టార్ అంత ప్రేమతో అలా చేయడంతో నేను షాక్ అయ్యాను. నా జీవితంలో మరిచిపోలేని రోజు అది" అని చెప్పుకొచ్చాడు.

Rajanikanth
Nayanatara
Meena
Keerthi Suresh
  • Loading...

More Telugu News