Petrol: దేశ ప్రజలకు దీపావళి కానుక.. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం!
- నానాటికీ పెరుగుతున్న పెట్రోలియం ధరలతో బెంబేలెత్తుతున్న జనాలు
- దీపావళి సందర్భంగా సుంకాన్ని తగ్గించిన కేంద్రం
- పెట్రోల్ పై రూ. 5, డీజిల్ పై రూ. 10 తగ్గింపు
రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడి వీపు విమానం మోత మోగుతోంది. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం నిత్యావసరాలన్నింటిపై పడుతోంది. అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అయితే దీపావళి పండుగ సందర్భంగా జనాలకు కేంద్ర ప్రభుత్వం కొంత ఊరట కలిగించింది. పెట్రోల్, డీజిల్ పై సుంకాన్ని తగ్గిస్తున్నట్టు తెలిపింది. లీటరు పెట్రోల్ పై రూ. 5, లీటరు డీజిల్ పై రూ. 10 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. రేపటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సుంకాలను తగ్గిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంటుంది.