Rajamouli: భ‌విష్య‌త్తులో నా సినిమాలు ఫ్లాప్ అయితే మ‌ళ్లీ నా భార్య‌ను ఉద్యోగానికి పంపిస్తా: దర్శకుడు రాజ‌మౌళి

will send my wife to job rajamouli

  • గ‌తంలో ఓ స‌మ‌యంలో నాకు పైసా సంపాదన లేదు
  • నా భార్య సంపాద‌న‌ మీద బతికాను
  • చెప్పుకోవడానికి సిగ్గేయడం లేదు
  • ప్ర‌తిరోజు ఉద‌యాన్నే ఆఫీసు వ‌ద్ద డ్రాప్ చేసి వ‌చ్చేవాడిని

సినీ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి గ‌తంలో త‌న వ‌ద్ద డ‌బ్బులు లేక అనుభ‌వించిన క‌ష్టాల గురించి చెప్పారు. ప్ర‌స్తుతం ఆయ‌న సినిమా 'ఆర్ఆర్ఆర్' విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ... గ‌తంలో ఓ స‌మ‌యంలో తనకు పైసా సంపాదన లేదని, అప్ప‌ట్లో తాను త‌న భార్య సంపాద‌న‌ మీద బతికానని చెప్పారు.

భార్య సంపాద‌న‌పై బ‌తికాన‌ని చెప్పుకోవడానికి సిగ్గేయడం లేదని, సంతోషంగానే ఉందని తెలిపారు. తాను దర్శకుడు కాకముందు త‌న భార్య ర‌మ‌ ఉద్యోగం చేసేవార‌ని, ఆమెను ప్ర‌తిరోజు ఉద‌యాన్నే బైక్‌పై ఆఫీసు వ‌ద్ద డ్రాప్ చేసి వ‌చ్చేవాడిన‌ని గుర్తు చేసుకున్నారు.

మ‌ళ్లీ సాయంత్రం వెళ్లి ఇంటికి తీసుకొచ్చేవాడిన‌ని చెప్పారు. ఇంట్లో  కథ‌లు, డైలాగులు రాసుకోవడం వంటి ప‌ని చేసేవాడినని అన్నారు. భ‌విష్య‌త్తులో త‌న సినిమాల‌కు ఫ్లాపులు వ‌స్తే, సినిమాలు బాగా లేక‌పోతే భార్య‌ను మళ్లీ ఉద్యోగానికి పంపిస్తాన‌ని చెప్పారు. నిజమైన ప్రేమ అంటే ఏంటో త‌న‌ భార్యను చూసిన తరువాతే తెలిసిందని అన్నారు.

  • Loading...

More Telugu News