Adivi Sesh: 'మేజర్' రిలీజ్ డేట్ ఖరారు!

Major movie wiil release on Feb 11th

  • 'మేజర్' కోసం వేసిన 8 భారీ సెట్లు
  • 75 లొకేషన్స్ లో జరిపిన షూటింగు
  • 120 రోజుల్లో షూటింగు పూర్తి
  • 3 భాషల్లో భారీస్థాయి విడుదల
  • ఫిబ్రవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు  

మొదటి నుంచి కూడా అడివి శేష్ విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషిస్తూ వస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'మేజర్' రూపొందింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మహేశ్ బాబు కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

రీసెంట్ గా షూటింగు పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశారు. తెలుగుతో పాటు మలయాళ  .. హిందీ భాషల్లో ఫిబ్రవరి 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెప్పారు.

ఈ సినిమా మేకింగ్ కి సంబంధించిన గ్లింప్స్ ద్వారా రిలీజ్ డేట్ ను ప్రకటించడం విశేషం. ఈ సినిమా కోసం 8 సెట్స్ వేయించి ..  75  లొకేషన్స్ లో 120 రోజుల్లో షూటింగును పూర్తి చేసినట్టుగా చెప్పారు. అడివి శేష్ సరసన నాయికలుగా సయీ మంజ్రేకర్ .. శోభిత ధూళిపాళ సందడి చేయనున్నారు. రేవతి ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

Adivi Sesh
Shobhitha Dhulipala
Saiee Manjrekar
  • Error fetching data: Network response was not ok

More Telugu News