Sangeeth Shobhan: మహేశ్ చుట్టూ తిరిగే 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'

Oka Chinna Family Story will release in Zee 5

  • నిహారిక నిర్మాణంలో మరో వెబ్ సిరీస్
  • ఓ మధ్యతరగతి యువకుడి కథ
  • జీ 5 ఓటీటీ వేదికగా విడుదల
  • ఈ నెల 19 నుంచి ప్రీమియర్స్      

ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ ల జోరు పెరుగుతోంది. ఓటీటీ వేదికగా ఇవి పలకరిస్తున్నాయి. యూత్ నుంచి వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. దాంతో అందరూ కూడా వెబ్ సిరీస్ ల వైపు మొగ్గు చూపుతున్నారు. వెబ్ సిరీస్ లను నిర్మించడంలో నిహారికకు మంచి అనుభవం ఉంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై ఆమె చేసిన మరో వెబ్ సెరీస్ పేరే 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'.

కామెడీ ఎంటర్టైనర్ జోనర్లో సాగే ఈ వెబ్ సిరీస్ నుంచి, రీసెంట్ గా నాని చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేయించగా మంచి రెస్పాన్స్ వస్తోంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన మహేశ్ అనే ఒక యువకుడి చుట్టూ తిరిగే కథ ఇది. తన తండ్రి తనకి అప్పుల బాధను అంటగట్టడంతో ఈ పాత్ర పడే అవస్థలతో సాగే కథ ఇది.

ఈ సిరీస్ లో ప్రధానమైన పాత్రను సంగీత్ శోభన్ పోషించాడు. ఆయన తల్లిదండ్రుల పాత్రల్లో సీనియర్ నరేశ్ - తులసి నటించారు. ఇక సంగీత్ శోభన్ జోడీగా సిమ్రాన్ శర్మ కనిపించనుంది. ఈ నెల 19వ తేదీ నుంచి జీ 5 లో ప్రీమియర్స్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక ఈ సిరీస్ ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబడుతుందో చూడాలి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News