Basavaraj Bommai: ఓ మహిళ అత్యుత్సాహంతో ఇబ్బందిపడిన కర్ణాటక సీఎం బొమ్మై... వీడియో ఇదిగో!

When Karnataka CM feels nervous

  • కర్ణాటకలో జనసేవక పథకం
  • అమలును పరిశీలించిన సీఎం
  • ఓ మహిళ నివాసం ముందు ఆగిన వైనం
  • సీఎం చేతిని అందుకుని ముద్దుల వర్షం కురిపించిన మహిళ

ప్రజాభిమానం ఒక్కోసారి హద్దులు దాటడం నేతలను ఇబ్బందికి గురిచేస్తుంటుంది. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. జనసేవక కార్యక్రమంలో పాల్గొన్న బొమ్మై అందులో భాగంగా బెంగళూరు గుట్టహళ్లి ప్రాంతానికి వెళ్లారు. భారీ జనసందోహం వెంటరాగా, ఆయన ఓ ఇంటిముందు ఆగారు.

అయితే ఆ ఇంటి యజమానురాలు సీఎం అంతటివాడు తన ఇంటి ముందు ఆగడంతో ఉబ్బితబ్బిబ్బయింది. తన ఆనందాన్ని ముద్దుల రూపంలో కురిపించింది. సీఎం బసవరాజ్ బొమ్మై చేతిని అందుకుని కళ్లకు అద్దుకుని, అదేపనిగా ముద్దులు పెట్టింది. దాంతో సీఎం బొమ్మై ఇబ్బందికరంగా ఫీలయ్యారు. తన చేయిని ఆమె ఎంతకీ వదలకపోవడంతో ఆయన అసహనానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే ఇంటి ముంగిటకే పాలన తరహాలో జనసేవక పథకం ప్రారంభించింది. ఇందులో భాగంగా 58 ప్రభుత్వ సేవలను ప్రజలకు వారి ఇళ్ల వద్దనే అందుబాటులోకి తీసుకురానున్నారు. తొలి దశలో భాగంగా బెంగళూరులోని 198 మున్సిపల్ వార్డుల్లో అమలు చేస్తున్నారు. ఈ పథకం అమలును పరిశీలించేందుకే సీఎం బవసరాజ్ బొమ్మై నగరంలో పర్యటనకు వచ్చారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News