BJP: ఆరేళ్ల చిన్నారిపై టీఆర్ఎస్ నేత అత్యాచారం ఘటన.. మండిపడ్డ బీజేపీ నేత బండి సంజయ్​!

Sanjay Fires On TRS Party Over Rape On six year old child

  • పసిపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోవట్లేదు
  • పసిపాప భవిష్యత్ ను నాశనం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి
  • నీలోఫర్ లో బాధిత బాలిక, కుటుంబానికి సంజయ్ పరామర్శ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై టీఆర్ఎస్ నాయకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. హైదరాబాద్, నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని, ఆ బాలిక కుటుంబాన్ని ఆయన ఇవాళ పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

టీఆర్ఎస్ నాయకుడిది అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు లైసెన్స్డ్ గూండాలుగా మారిపోయారని మండిపడ్డారు. అభం శుభం తెలియని పసిపాప బంగారు భవిష్యత్ ను నాశనం చేసిన ఆ మూర్ఖుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పాలనలో పసిపిల్లలపై అఘాయిత్యాలు, దాడులు జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితులు లేవని సంజయ్ విమర్శించారు. చిన్నారి ప్రాణాలను కాపాడాలన్న ఆలోచన కూడా చేయలేదన్నారు.

ఆసుపత్రికి తీసుకొచ్చాక చికిత్స చేసేందుకు వైద్యులు సిద్ధమైనా..  చికిత్స చేయొద్దంటూ  అటు సీఎంవో నుంచి ఇటు మంత్రి నుంచి వైద్యులకు ఒత్తిళ్లు ఎదురయ్యాయని ఆయన ఆరోపించారు. వెంటనే ఇంటికి పంపాలంటూ ఒత్తిడి తెచ్చారన్నారు. పోలీసు బందోబస్తు మధ్య చిన్నారిని ఆసుపత్రి నుంచి పంపించే ప్రయత్నం చేశారన్నారు. పేపర్ లోనూ, వార్తా చానెళ్లలోనో వస్తేనే సీఎం కేసీఆర్ స్పందిస్తారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News