Huzurabad: టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మండలం వీణవంకలో కూడా బీజేపీదే ఆధిక్యం!
- హుజూరాబాద్ మండలంలో పూర్తి ఆధిక్యతను ప్రదర్శించిన బీజేపీ
- వీణవంక మండలం ఓట్ల లెక్కింపు ప్రారంభం
- ఏడో రౌండ్ లో కూడా ఈటలదే ఆధిక్యత
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఆరు రౌండ్ల లెక్కింపు జరగ్గా... అన్ని రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్ సాధించారు. తొలి ఆరు రౌండ్లు హుజూరాబాద్ మండలానికి సంబంధించినవి కావడం గమనార్హం. హుజూరాబాద్ మండలానికి సంబంధించి ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ మండలంలో బీజేపీ పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది.
ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మండలమైన వీణవంక మండలంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. ఏడో రౌండ్ లో కూడా బీజేపీనే ఆధిక్యతను ప్రదర్శిస్తోంది.