CM Jagan: వైఎస్సార్ అవార్డుల కార్యక్రమంలో కత్తి పద్మారావు వీల్ చెయిర్ ను స్వయంగా సరిచేసిన సీఎం జగన్... వీడియో ఇదిగో!

CM Jagan adjusts Kathi Padmarao wheel chair pedals

  • విజయవాడలో వైఎస్సార్ లైఫ్ టైమ్ అవార్డుల కార్యక్రమం
  • వీల్ చెయిర్ లో వచ్చిన కత్తి పద్మారావు
  • పైకిలేచేందుకు ఇబ్బందిపడిన వైనం
  • పెడల్స్ సరిచేసి సాయపడిన సీఎం జగన్

వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవం విజయవాడలోని 'ఏ' కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరిగింది. సాహిత్యం విభాగంలో కత్తి పద్మారావును వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుతో గౌరవించారు. ఈ సందర్భంగా ఆసక్తికర దృశ్యం కనిపించింది.

దళిత సామాజిక వేత్త, రచయిత కత్తి పద్మారావు వీల్ చెయిర్ లో ఉండి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే కత్తి పద్మారావు అవార్డు అందుకునేందుకు పైకి లేవడానికి చాలా ఇబ్బందిపడ్డారు. దాంతో సీఎం జగన్ స్వయంగా చేయందించి ఆయనను పైకి లేపారు. అనంతరం అవార్డు ప్రదానం చేశారు. ఆపై వీల్ చెయిర్ కదలకపోవడంతో సీఎం జగన్ స్వయంగా  పెడల్స్ ను సరిచేశారు. సీఎం అంతటివాడు తన పట్ల అంత శ్రద్ధ చూపడం పట్ల కత్తి పద్మారావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ దృశ్యం సభికులను విపరీతంగా ఆకట్టుకుంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News