Team India: న్యూజిలాండ్ పై అతికష్టమ్మీద 110 పరుగులు చేసిన టీమిండియా

Team India batting failure continues

  • మరోసారి టీమిండియా టాపార్డర్ విఫలం
  • పేలవ షాట్లతో అవుటైన భారత బ్యాట్స్ మెన్
  • 26 పరుగులు చేసిన జడేజా
  • ట్రెంట్ బౌల్ట్ కు 3 వికెట్లు

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతోంది. నేడు న్యూజిలాండ్ తో పోరులో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 110 పరుగులు చేసింది. ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన రవీంద్ర జడేజా చేసిన 26 పరుగులే అత్యధికం. హార్దిక్ పాండ్య 23 పరుగులు చేశాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ 18 పరుగులు చేసి అవుట్ కాగా, వన్ డౌన్ లో వచ్చిన రోహిత్ శర్మ 14 పరుగులతో సరిపెట్టుకున్నాడు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ 9 పరుగులు చేసి నిరాశపర్చగా, ఓపెనర్ గా దిగిన ఇషాన్ కిషన్ (4) అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. భారీ హిట్టింగ్ చేస్తాడని భావించిన రిషబ్ పంత్ (12)ను మిల్నే బౌల్డ్ చేయడంతో ఆ ఆశలు కూడా ఆవిరయ్యాయి.

న్యూజిలాండ్ బౌలింగ్ మరీ అంత ప్రమాదకరంగా ఏమీ లేకపోయినా, భారత ఆటగాళ్లు పేలవ షాట్లతో వికెట్లు పారేసుకున్నారు. కివీస్ బౌలర్లలో లెఫ్టార్మ్ సీమర్ ట్రెంట్ బౌల్ట్ 3, లెగ్ స్పిన్నర్ ఇష్ సోధీ 2, టిమ్ సౌథీ 1, ఆడమ్ మిల్నే 1 వికెట్ తీశారు.

Team India
Batting
Failure
New Zealand
T20 World Cup
  • Loading...

More Telugu News