Pawan Kalyan: విశాఖ చేరుకున్న పవన్ కల్యాణ్... కాసేపట్లో భారీ బహిరంగ సభ

Pawan Kalyan arrives Visakhapatnam

  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
  • ఉద్యమించిన కార్మిక సంఘాలు
  • మద్దతు తెలిపిన పవన్ కల్యాణ్
  • నేడు సభాముఖంగా ప్రకటించనున్న వైనం

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న పవన్ కల్యాణ్.... ఇప్పటికే పోరాటం సాగిస్తున్న కార్మిక సంఘాలకు మద్దతు ప్రకటించేందుకు విశాఖపట్నం చేరుకున్నారు. కాసేపట్లో కూర్మన్నపాలెంలో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. విమానాశ్రయం నుంచి పవన్ సభాస్థలికి బయల్దేరారు. దారిపొడవునా జనసేన శ్రేణుల కోలాహలం కనిపిస్తోంది.

పవన్ తన పర్యటనలో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిరసనకారుల శిబిరాన్ని సందర్శించనున్నారు. కార్మికులకు తన సంఘీభావాన్ని ప్రకటించనున్నారు. బీజేపీతో ఏపీలో జనసేన భాగస్వామ్యం కొనసాగిస్తున్న నేపథ్యంలో... కేంద్రం తీసుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై పవన్ పోరాటం ఆసక్తి కలిగిస్తోంది.

Pawan Kalyan
Visakhapatnam
Vizag Steel Plant
Janasena
Andhra Pradesh
  • Loading...

More Telugu News