Balakrishna: బాలయ్య అభిమానులు షేర్ చేస్తున్న పునీత్ రాజ్ కుమార్ వీడియో ఇదే!

Balakrishna fans shares Punith Rajkumar video

  • పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం
  • భౌతికకాయానికి నివాళులు అర్పించిన బాలకృష్ణ
  • తీవ్ర భావోద్వేగాలకు గురైన వైనం
  • పునీత్ తో అనుబంధాన్ని తలచుకుని రోదించిన బాలయ్య

బెంగళూరులో ఇవాళ పునీత్ రాజ్ కుమార్ భౌతికకాయాన్ని చూసి టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ కంటతడి పెట్టిన వైనం అందరినీ కదిలించివేసింది. తనతో ఎంతో ఆత్మీయ అనుబంధం ఉన్న పునీత్ ఆకస్మిక మరణాన్ని బాలకృష్ణ తట్టుకోలేకపోయారు. కాగా, సోషల్ మీడియాలో బాలకృష్ణ అభిమానులు ఓ వీడియోను షేర్ చేస్తున్నారు.

గతంలో ఎన్టీఆర్ బయోపిక్ ప్రమోషన్ కార్యక్రమంలో బాలకృష్ణ, పునీత్ రాజ్ కుమార్ పాల్గొనడాన్ని ఆ వీడియోలో చూడొచ్చు. బాలయ్య చెంపపై ఏదో ఉండగా, పునీత్ తన కర్చీఫ్ తో తుడవడం వీడియోలో కనిపించింది. అదే వీడియోలో... నేడు బాలయ్య పునీత్ భౌతికకాయం వద్ద విషణ్ణ వదనంతో ఉన్న దృశ్యాలను కూడా పొందుపరిచారు. పునీత్ మరణాన్ని భరించలేక బాలకృష్ణ చేతితో తల కొట్టుకోవడం, ఉబికివస్తున్న కన్నీటిని ఆపుకునేందుకు విఫలయత్నాలు చేయడం ఈ వీడియోలో చూడొచ్చు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News