Balakrishna: పునీత్ రాజ్ కుమార్ భౌతికకాయాన్ని చూసి కంటతడి పెట్టిన బాలకృష్ణ

- బెంగళూరు కంఠీరవ స్టేడియంలో ప్రజల సందర్శనార్థం పునీత్ భౌతికకాయం
- పునీత్ కు నివాళి అర్పించిన బాలయ్య
- పునీత్ భార్యకు పరామర్శ
కన్నడ స్టార్ హీరో, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మృతి యావత్ సినీ రంగాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. 46 ఏళ్ల వయసులోనే పునీత్ తనువు చాలించడం అందరినీ కలచి వేస్తోంది. ఆయన గౌరవార్థం బెంగళూరు నగరం దాదాపు షట్ డౌన్ అయిపోయింది. పునీత్ కు నివాళి అర్పిస్తూ నగరంలోని షాపులను ఎవరికి వారు మూసివేశారు. మరోవైపు అభిమానుల సందర్శనార్థం నగరంలోని కంఠీరవ క్రికెట్ స్టేడియంలో పునీత్ పార్థివదేహాన్ని ఉంచారు. ఆయనను చివరిసారి చూసుకునేందుకు వేలాదిమంది స్టేడియంకు తరలి వస్తున్నారు.
