Sensex: ఈరోజు కూడా భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు

Markets ends in huge losses

  • 677 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 185 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 3.53 శాతం నష్టపోయిన టెక్ మహీంద్రా

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా భారీ నష్టాలలో ముగిశాయి. ఈ ఉదయం సానుకూలంగానే ప్రారంభమైన మార్కెట్లు వెంటనే భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ కోలుకున్నప్పటికీ ఎంతో సేపు నిలవలేకపోయాయి. అంతర్జాతీయంగా సానుకూలతలు లేకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 677 పాయింట్లు నష్టపోయి 59,306కి పడిపోయింది. నిఫ్టీ 185 పాయింట్లు కోల్పోయి 17,671కి దిగజారింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (2.61%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (2.12%), మారుతి సుజుకి (1.49%), టాటా స్టీల్ (1.34%), టైటాన్ కంపెనీ (0.66%).
 
టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-3.53%), ఎన్టీపీసీ (-3.05%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.62%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-2.53%), ఎల్ అండ్ టీ (-2.51%).

  • Loading...

More Telugu News