Vijay Sai Reddy: ఇలాంటి దొంగల ముఠాకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదు: విజ‌య‌సాయిరెడ్డి

vijay sai slams tdp

  • టీడీపీ నేతలు ఉన్మాదుల్లా, ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారు
  • ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు  
  • అందుకే టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని కోరాం

తెలుగు దేశం పార్టీపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రాజ్యాంగబద్ధంగా జరిగే ఎన్నికల్లో టీడీపీ ఉండకూడదని, ఆ పార్టీని రద్దు చేయాలని నిన్న ఎన్నిక‌ల స‌ఘాన్ని ఆయ‌న కోరిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావిస్తూ ట్వీట్ చేశారు.

'టీడీపీ నేతలు ఉన్మాదుల్లా, ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ఇలాంటి దొంగల ముఠాకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదు. అందుకే టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని ఎలక్షన్ కమిషన్ ను కోరాం' అని విజ‌య‌సాయిరెడ్డి  ఈ రోజు ట్విట్ట‌ర్‌లో వివ‌రించారు.

Vijay Sai Reddy
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News