Hardik Pandya: ఎట్టకేలకు నెట్స్ లో బౌలింగ్ ప్రాక్టీసు చేసిన హార్దిక్ పాండ్య

Hardik Pandya bowls in nets

  • కొంతకాలంగా పాండ్య బౌలింగ్ కు దూరం
  • జట్టులో కూర్పుపై ప్రభావం
  • జట్టులో పాండ్య స్థానాన్ని ప్రశ్నిస్తున్న మాజీలు
  • అన్ని వైపుల నుంచి పాండ్యపై ఒత్తిడి

టీమిండియాలో కొన్నాళ్ల కిందట హార్దిక్ పాండ్య సిసలైన ఆల్ రౌండర్ అంటూ పేరుతెచ్చుకున్నాడు. అయితే గాయాలపాలవడంతో జట్టుకు దూరమైన పాండ్య ఆ తర్వాత పునరాగమనం చేసినా ఫిట్ నెస్ కాపాడుకోవడం కోసం కేవలం బ్యాటింగ్ పైనే దృష్టి పెట్టాడు. ఆల్ రౌండర్ కోటాలో జట్టులోకి వచ్చినా, బౌలింగ్ చేయకపోవడం జట్టు కూర్పుపై తీవ్ర ప్రభావం చూపింది.

మాజీలు సైతం జట్టులో పాండ్య స్థానాన్ని ప్రశ్నిస్తున్నారు. బౌలింగ్ చేయనప్పుడు అతడిని జట్టులో కొనసాగించడం ఎందుకు అన్న అభిప్రాయం అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో ఎట్టకేలకు నెట్స్ లో బంతి పట్టాడు.

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా తన రెండో మ్యాచ్ కు సిద్ధమవుతుండగా, పాండ్య నెట్స్ లో బౌలింగ్ చేస్తూ చెమటోడ్చాడు. బ్యాటింగ్ మాత్రమే కాదు, పలువురు సహచర ఆటగాళ్లకు ఫాస్ట్ బౌలింగ్ చేసి తన ఫిట్ నెస్ ను పరీక్షించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది.

Hardik Pandya
Bowling
Nets
Team India
T20 World Cup
  • Loading...

More Telugu News