Devineni Uma: ఏ ఆధారాలతో చంద్రబాబును టెర్రరిస్టు అన్నారు?: దేవినేని ఉమ

Devineni Uma fires on Vijayasai Reddy

  • చంద్రబాబును టెర్రరిస్టు అన్న విజయసాయిరెడ్డి
  • విజయసాయికి పోలీసులు నోటీసులు ఇస్తారా? అని ప్రశ్నించిన దేవినేని ఉమ
  • 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిని ఇలా అనడం దారుణమని వ్యాఖ్య

చంద్రబాబును టెర్రరిస్టు అంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని... ఈ వ్యాఖ్యలపై స్పందించి, ఆయనకు పోలీసులు నోటీసులు ఇస్తారా? అని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ఏ ఆధారాలతో చంద్రబాబును విజయసాయిరెడ్డి టెర్రరిస్టు అన్నారని నిలదీశారు. ఆర్థిక ఉగ్రవాది విజయసాయి నుంచి చంద్రబాబు నడవడిక నేర్చుకోవాలా? అని దుయ్యబట్టారు. రాజకీయాల్లో 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబును ఉద్దేశించి ఇలా మాట్లాడటం దారుణమని అన్నారు.

Devineni Uma
Chandrababu
Telugudesam
Vijayasai Reddy
YSRCP
  • Loading...

More Telugu News