Quinton DeCock: 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్'కు మద్దతు ఇవ్వలేనంటూ చివరి నిమిషంలో మ్యాచ్ నుంచి తప్పుకున్న డికాక్
- వెస్టిండీస్ తో తలపడిన దక్షిణాఫ్రికా
- మ్యాచ్ కు అరగంట ముందు బాంబు పేల్చిన డికాక్
- డికాక్ స్థానంలో హెండ్రిక్స్
- డికాక్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం
టీ20 వరల్డ్ కప్ లో నేడు దక్షిణాఫ్రికా జట్టు వెస్టిండీస్ తో తలపడి విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా దక్షిణాఫ్రికా జట్టులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి మద్దతు ఇవ్వలేనంటూ ఆ జట్టు స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్ చివరి నిమిషంలో మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు.
ఈ టీ20 టోర్నీలో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి మద్దతుగా మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లు మోకాళ్లపై కూర్చుంటున్నారు. అయితే తాను ఈ ఉద్యమానికి మద్దతు పలకలేనని, అవసరమైతే మ్యాచ్ నుంచి తప్పుకుంటానని డికాక్ వెస్టిండీస్ తో మ్యాచ్ కు అరగంట ముందు డ్రెస్సింగ్ రూంలో బాంబు పేల్చాడు. దాంతో డికాక్ స్థానంలో హెండ్రిక్స్ కు తుదిజట్టులో స్థానం కల్పించారు.
తాము ఆదేశించినప్పటికీ డికాక్ పాటించకపోవడంతో అతడిపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.