చరణ్ మూవీలో పవర్ఫుల్ విలన్ గా సురేశ్ గోపీ!
- షూటింగు దశలో శంకర్ మూవీ
- పవర్ఫుల్ గా డిజైన్ చేసిన విలన్ రోల్
- ముఖ్యమైన పాత్రల్లో శ్రీకాంత్ .. సునీల్
- వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు
చరణ్ తో శంకర్ ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు పూణేలో జరుగుతోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా బలమైనదిగా కనిపిస్తుందట. ఆ పాత్రకి సురేశ్ గోపీ అయితే సరిగ్గా సెట్ అవుతాడని భావించిన శంకర్, ఆయనను ఎంపిక చేశాడని అంటున్నారు.
తెలుగులో సురేశ్ గోపీ చేస్తున్న తొలి సినిమా ఇదే అవుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా కియారా అద్వాని అలరించనుంది. ఇక ఇతర ముఖ్యమైన పాత్రల్లో శ్రీకాంత్ .. సునీల్ .. అంజలి కనిపించనున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.