Madhu Yaskhi: ఉద్యోగాలు వస్తాయనుకుంటే... కేసీఆర్ బర్రెలు, గొర్రెలు అంటున్నారు: మధు యాష్కీ
- టీఆర్ఎస్ ప్లీనరీ పొగడ్తలకే సరిపోయింది
- మూసీలో మురికి ఎంతుందో.. టీఆర్ఎస్ లో అవినీతి అంత ఉంది
- ఆత్మహత్యల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది
టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ మొత్తం సొంత పొగడ్తలకే సరిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ ఎద్దేవా చేశారు. అమరవీరులను ఒక్కరిని కూడా గుర్తు చేసుకోలేదని విమర్శించారు. మూసీ కాలువలో మురికి ఎంత ఉందో టీఆర్ఎస్ పార్టీలో అవినీతి అంత ఉందని చెప్పారు.
ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఆత్మహత్యలు ఆగలేదని, నిరుద్యోగ యువత పరిస్థితి అత్యంత దారుణంగా తయారయిందని అన్నారు. ఆత్మహత్యల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని... అయినా కేసీఆర్ కు సోయిలేదని దుయ్యబట్టారు. తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారడంలో కేసీఆర్ చేసిన కృషి ఏమీ లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు వస్తాయనుకుంటే కేసీఆర్ గొర్రెలు, బర్రెలు అంటున్నారని విమర్శించారు.