Nikhil: నాలుగు సినిమాలతో జోరుమీదున్న నిఖిల్!

Nikhil movies update

  • 2019లో వచ్చిన 'అర్జున్ సురవరం'
  • కరోనా వలన వచ్చిన గ్యాప్
  • ముగింపు దశలో రెండు సినిమాలు
  • మిగిలిన సినిమాలపై రావలసిన స్పష్టత    

మొదటి నుంచి కూడా నిఖిల్ వైవిధ్యభరితమైన కథలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వచ్చాడు. విభిన్నమైన .. విలక్షమైన పాత్రలను చేస్తూ వచ్చాడు. కరోనా చూపిన ప్రభావం కారణంగా 'అర్జున్ సురవరం' హిట్ తరువాత ఆయన నుంచి మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు.

ఈ నేపథ్యంలో తాజాగా నిఖిల్ ఒక ట్వీట్ చేశాడు. ఇంతకుముందు ఒక సినిమా తరువాత ఒక సినిమా చేశాననీ, ఈ సారి మాత్రం ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్నానని చెప్పాడు. నాలుగు పిల్లల్లో ఎవరు ఎక్కువ ఇష్టమంటే ఏం చెబుతాం .. ఇది కూడా అంతే. ఈ సినిమాలన్నీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను" అని రాసుకొచ్చాడు.

నిఖిల్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో '18 పేజెస్' చేస్తున్నాడు. అలాగే చందూ మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ 2' చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా  చాలా వరకూ చిత్రీకరణను జరుపుకున్నాయి. ఇక మిగిలిన రెండు సినిమాలు ఏ బ్యానర్లో .. ఎవరితో చేస్తున్నాడనే విషయంలోనే నిఖిల్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Nikhil
18 Pages Movie
karthikeya 2 Movie
  • Loading...

More Telugu News