Junior NTR: ఒకేసారి వివిధ భాషల్లో 'ఆర్ఆర్ఆర్' టీజర్!

RRR movie update

  • పాన్ ఇండియా మూవీగా 'ఆర్ఆర్ఆర్'
  • ప్రధాన పాత్రధారులుగా ఎన్టీఆర్ - చరణ్
  • బాలీవుడ్ - హాలీవుడ్ ఆర్టిస్టులు
  • జనవరి 7వ తేదీన భారీ రిలీజ్

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' రూపొందుతోంది. ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, అందరిలో ఆసక్తిని పెంచుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు, కీరవాణి సంగీతాన్ని అందించారు. జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నారు.

ఇంతవరకూ ఈ సినిమాకి సంబంధించి వచ్చిన ప్రతి అప్ డేట్ .. సినిమాపై అంచనాలు పెంచేలా చేశాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదలడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్న అన్ని భాషల్లోనూ ఒకే రోజున ఒకే సమయంలో టీజర్ ను రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.

ఆల్రెడీ టీజర్ ను కట్ చేయడం జరిగిపోయిందట. అయితే వివిధ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి తగిన డేట్ ను ఫిక్స్ చేసే పనిలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. త్వరలో ఈ డేట్ ను ఖరారు చేయనున్నారు. అజయ్ దేవగణ్ .. అలియా భట్ వంటి బాలీవుడ్ ఆర్టిస్టులతో పాటు, హాలీవుడ్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో నటించడం విశేషం..

Junior NTR
Ramcharan
Alia Bhatt
Ajay Devgan
  • Loading...

More Telugu News