Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Pooja Hegde says music relieves her from tension
  • 'మ్యూజిక్ థెరపీ' అంటున్న ముద్దుగుమ్మ 
  • 'ఆదిపురుష్' చివరి షెడ్యూల్ లో ప్రభాస్
  • వైష్ణవ్ తేజ్ తో బొమ్మరిల్లు భాస్కర్
*  'నా టెన్షన్ ను సంగీతం ఇట్టే మాయం చేసేస్తుంది..' అంటోంది కథానాయిక పూజ హెగ్డే.  'ఏదైనా విషయమై టెన్షన్ గా ఉందనుకోండి.. వెంటనే మంచి సంగీతాన్ని వింటాను. అలాగే డల్ గా వున్నప్పుడు కూడా మ్యూజిక్ వింటాను. దీంతో కాసేపటికే ఒత్తిడి మాయం అవుతుంది. డల్ నెస్ పోతుంది. అందుకే, మ్యూజిక్ అన్నది నా బెస్ట్ ఫ్రెండ్' అని చెప్పింది పూజ.
*  ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్' చివరి షెడ్యూలు షూటింగ్ నిన్న మొదలైంది. ప్రభాస్ కూడా ఈ షూటింగులో పాల్గొంటున్నాడు. ఇందులో కృతి సనన్ కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే.
*  తాజాగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' చిత్రంతో విజయాన్ని అందుకున్న బొమ్మరిల్లు భాస్కర్ తన తదుపరి చిత్రాన్ని కూడా గీతా ఆర్ట్స్ సంస్థలో చేస్తున్నాడు. ఇందులో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తాడని సమాచారం.
Pooja Hegde
Prabhas
Kriti Sanan
Vaishnav Tej

More Telugu News