Karanam Dharmasri: కుమార్తె పెళ్లివేడుకలో పాటలు పాడిన వైసీపీ ఎమ్మెల్యే... వీడియో ఇదిగో!

YSRCP MLA Karanam Dharmasri sings in his daughter wedding

  • విశాఖలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహం
  • హాజరైన వైసీపీ ప్రముఖులు
  • పాటకచ్చేరీలో అందరినీ అలరించిన ఎమ్మెల్యే
  • సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్న వీడియో

వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహం విశాఖలో ఘనంగా జరిగింది. ఎంజీఎం పార్కులో అంగరంగ వైభోగంగా జరిగిన ఈ పెళ్లివేడుకలో పాటకచ్చేరీ కూడా ఏర్పాటు చేశారు. కుమార్తె పెళ్లి సందర్భంగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా మైక్ అందుకుని ఉత్సాహంగా పాటలు పాడారు. ఆల్ టైమ్ హిట్ సాంగ్ నన్ను దోచుకుందువతే వన్నెల దొరసానీ అంటూ మధురంగా ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ  రెండో కుమార్తె వివాహం చరణ్ తో వైజాగ్ బీచ్ రోడ్డులోని ఎంజీఎం పార్కులో నిన్న ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి వైసీపీ మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News