KRMB: కర్నూలు జిల్లాలో రేపు, ఎల్లుండి కేఆర్ఎంబీ బృందం పర్యటన

KRMB Committee two day tour in Kurnool district
  • గెజిట్ నోటిఫికేషన్ పై ఏపీ సర్కారు జీవో
  • రెండ్రోజుల పర్యటనకు కర్నూలు జిల్లా వస్తున్న కేఆర్ఎంబీ
  • ప్రాజెక్టులు, విద్యుదుత్పత్తి కేంద్రాల పరిశీలన
  • కేఆర్ఎంబీ కమిటీలో పదిమంది సభ్యులు
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) కమిటీ కర్నూలు జిల్లాలో రెండ్రోజుల పాటు పర్యటించనుంది. కృష్ణా నది ప్రాజెక్టుల స్వాధీనానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ పై ఏపీ సర్కారు జీవో జారీ చేసిన నేపథ్యంలో కేఆర్ఎంబీ బృందం కర్నూలు జిల్లాలో రేపు, ఎల్లుండి పర్యటించాలని నిర్ణయించింది.

రేపు మల్యాల, ముచ్చుమర్రి, హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను సందర్శించనుంది. ఎల్లుండి శ్రీశైలం ప్రాజెక్టు విద్యుదుత్పత్తి కేంద్రాలను పరిశీలించనుంది. కేఆర్ఎంబీ కమిటీలో ఏపీ, తెలంగాణ, జెన్ కో అధికారులు సహా మొత్తం 10 మంది సభ్యులు ఉంటారు.
KRMB
Kurnool District
Projects
Andhra Pradesh
Telangana

More Telugu News