Akash Puri: నువ్వు కాలర్ ఎగరేసేలా చేస్తాను నాన్న: ఆకాశ్ పూరి

Rocketry movie update

  • నీ గురించి అవమానంగా మాట్లాడారు
  • నువ్వేంటో నిరూపించావు
  • నేనేంటో చూపిస్తాను
  • నువ్వు గర్వపడేలా చేస్తాను

ఆకాశ్ పూరి కథానాయకుడిగా అనిల్ పాదూరి దర్శకత్వంలో 'రొమాంటిక్' సినిమా రూపొందింది. కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు పూరి అందించిన ఈ సినిమా, ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి వరంగల్ .. రంగీలా మైదాన్ లో జరిగింది.

ఈ వేదికపై ఆకాశ్ పూరి మాట్లాడుతూ .. "నాన్నా, అందరూ ఇక నీ పనైపోయిందని హేళనగా మాట్లాడారు. ఆ మాటలు విన్నప్పుడల్లా నాకు చాలా బాధ అనిపించింది. 'ఇస్మార్ట్ శంకర్'తో అదిరిపోయే హిట్ ఇచ్చి, నేను కాలర్ ఎగరేసుకునేలా చేశావు. నన్ను చూసి కూడా నువ్వు కాలర్ ఎగరేసేలా చేస్తాను .. అంతవరకూ కష్టపడుతూనే ఉంటాను.

బ్యాక్ గ్రౌండ్ లేనివాడు ఫెయిలైతే అయ్యోపాపం అంటూ సానుభూతి చూపుతారు. బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాడు ఫెయిలైతే ఒక మనిషిలా కూడా చూడరు. అందువలన నేను సక్సెస్ అవుతాను నాన్న. నాకు తెలిసింది సినిమానే .. హిట్లు వచ్చినా .. ఫ్లాపులు వచ్చినా సినిమాలు చేసుకుంటూనే వెళతా. ఏదో ఒక రోజున నువ్వు గర్వపడేలా మాత్రం చేస్తా" అంటూ ఆవేశంగా మాట్లాడాడు. 

Akash Puri
Kethika Sharma
Puri Jagannadh
  • Loading...

More Telugu News