Sensex: ప్రారంభ లాభాలను కోల్పోయి నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

sensex ends 101 points low

  • 101 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 63 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 3 శాతానికి పైగా పడిపోయిన ఐటీసీ షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాలనే మూటకట్టుకున్నాయి. రికార్డు స్థాయులకు పెరిగిన మార్కెట్లు గత నాలుగు సెషన్లుగా నష్టాల్లోనే ముగియడం గమనార్హం. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు లాభాల్లోకి వెళ్లాయి. అయితే గంట తర్వాత ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి.

అమ్మకాల ఒత్తిడికి గురైన మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 101 పాయింట్లు కోల్పోయి 60,821కి పడిపోయింది. నిఫ్టీ 63 పాయింట్లు నష్టపోయి 18,114 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.25%), బజాజ్ ఆటో (1.81%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.21%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.19%), యాక్సిస్ బ్యాంక్ (0.98%).

టాప్ లూజర్స్:
ఐటీసీ (-3.39%), మారుతి సుజుకి (-2.12%), ఇన్ఫోసిస్ (-1.96%), ఎన్టీపీసీ (-1.93%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.45%).

  • Loading...

More Telugu News