Jagan: పేద బ్రాహ్మణుల కోసం జగన్ కీలక నిర్ణయం

AP govt to give financial aid to poor brahmins

  • అంత్యక్రియలకు రూ. 10 వేల ఆర్థికసాయం
  • గరుడ సహాయ పథకం ద్వారా సాయం
  • వార్షికాదాయం రూ. 75 వేల లోపు ఉన్నవారు అర్హులు

మరో కీలక పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. పేద బ్రాహ్మణ కుటుంబాలకు ఆర్థికసాయాన్ని అందించాలని ఆయన నిర్ణయించారు. పేద బ్రాహ్మణుల అంత్యక్రియలకు రూ. 10 వేల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. గరుడ సహాయ పథకం ద్వారా ఈ సాయాన్ని అందించనున్నారు. ఏడాది ఆదాయం రూ. 75 వేల లోపు ఉన్నవారికి ఈ సాయాన్ని అందిస్తారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునేవారు 40 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. http://andhrabrahmin.ap.gov.in వెబ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Jagan
YSRCP
Brahmins
Poor Brahmins
Scheme
  • Loading...

More Telugu News