KCR: అమర వీరుల స్ఫూర్తితో మిగతా వారూ పనిచేయాలి: సీఎం కేసీఆర్

CM KCR Remembers Police Martyrs

  • ఇవాళ పోలీసు అమరవీరుల దినోత్సవం
  • రాష్ట్రవ్యాప్తంగా స్మరించుకున్న పోలీస్ శాఖ
  • వారి త్యాగాన్ని ఎన్నటికీ మరువరాదన్న కేసీఆర్

శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమరవీరులను ఎన్నటికీ మరువరాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇవాళ పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆయన నివాళులర్పించారు. వారి సేవలను స్మరించుకున్నారు. అమరులైన పోలీసుల స్ఫూర్తితో మిగతా వారంతా విధినిర్వహణలో పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. హైదరాబాద్ లో హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిలు నివాళులర్పించారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని మహమూద్ అలీ అన్నారు.

సర్కార్ చొరవతో పోలీస్ శాఖ పటిష్ఠమైందని మహేందర్ రెడ్డి కొనియాడారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. కరోనా మహమ్మారి సమయంలో పోలీసుల సేవలు మరువలేనివన్నారు. నేరరహిత తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

KCR
Chief Minister
Telangana
Police
TS Police
  • Loading...

More Telugu News