Samantha: బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి సమంత తీర్థయాత్రలు

- శిల్పారెడ్డితో కలిసి చార్ ధామ్ యాత్ర
- మొదటగా యమునోత్రికి వెళ్లిన స్నేహితులు
- వశిష్ఠ మహర్షి గుహల సందర్శన
సమంత తీర్థయాత్రలకు వెళ్లింది. తన బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తోంది. ఉత్తరాఖండ్ లోని చార్ ధామ్ యాత్రకు వెళ్లింది. తీర్థయాత్రలో భాగంగా తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి సమంత ‘యమునోత్రి’కి వెళ్లింది. ఈ విషయాన్ని శిల్పారెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించింది. హెలికాప్టర్ ముందు సమంతతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసి.. ‘టేకాఫ్.. మొదట యమునోత్రికి వెళ్తున్నాం’ అంటూ మెసేజ్ చేసింది.
