Kriti Sanon: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Kriti Sanon compliments Prabhas

  • ప్రభాస్ కి కృతి సనన్ కాంప్లిమెంట్స్ 
  • 'హరిహర వీరమల్లు' తాజా షెడ్యూల్
  • ప్రభాస్ తో మరో బాలీవుడ్ సినిమా?

*  'స్క్రీన్ మీద మా జంట బాగా అందంగా కనపడుతుంది' అంటోంది బాలీవుడ్ నటి కృతి సనన్. 'ఆదిపురుష్'లో ప్రభాస్ సరసన ఈ చిన్నది కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తో తన కాంబినేషన్ గురించి చెబుతూ కృతి ఆ విధంగా పేర్కొంది. ఇక సెట్స్ లో ప్రభాస్ తో వర్క్ చేయడం గురించి చెబుతూ, 'మొదట్లో కాస్త సిగ్గరిగా కనిపించాడు. అయితే, తర్వాత అలవాటు అయ్యాక బాగా మాట్లాడడం మొదలెట్టాడు. టెన్షన్ ఉండదు.. ఆయనతో నటించడం చాలా హ్యాపీగా వుంది' అని చెప్పింది కృతి.
*  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'హరిహర వీరమల్లు' చిత్రం తాజా షెడ్యూలు షూటింగును ఈ నెల 25 నుంచి తిరిగి నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ షెడ్యూలులో భారీ యాక్షన్ దృశ్యాలను కూడా చిత్రీకరిస్తారట. పవన్ తో పాటు బాలీవుడ్ నటులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్జున్ రామ్ పాల్ కూడా ఈ షెడ్యూలులో పాల్గొంటారు.
*  ఇప్పటికే పలు భారీ చిత్రాలతో బిజీగా వున్న హీరో ప్రభాస్ మరో బాలీవుడ్ నిర్మాతతో పనిచేసే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రభాస్ తో ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తాజా సమాచారం.

Kriti Sanon
Pawan Kalyan
Krish
acqueline Fernandez
Prabhas
  • Loading...

More Telugu News