Ramgopal Verma: నల్లబల్లి సుధాకర్ అంటూ ఆర్జీవీ వార్నింగ్.. ఇంతకీ ఎవరాయన?

RGV Warning With the Name Nallaballi Sudhakar

  • ‘కొండా’ సినిమా షూటింగ్ ను ఆపలేరని కామెంట్
  • అరచేతితో సూర్యకాంతిని ఆపలేరని కార్ల్ మార్క్స్ తెలుసుకున్నాడు
  • ఇప్పుడు నల్లబల్లి కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి
  • ఓ తెలంగాణ మంత్రి పేరుతో నెటిజన్ల రిప్లైలు

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. ‘రక్తచరిత్ర’ అంటూ పరిటాల రవి జీవితాన్ని తెరమీద చూపించిన కాంట్రవర్షియల్ డైరెక్టర్.. ఇప్పుడు 'కొండా' పేరుతో వరంగల్ రాజకీయ నేత కొండా మురళి జీవితాన్ని తెరమీదకు తెస్తున్నారు. ఈ నెల 12న వరంగల్ లో కొండా సురేఖతో కలిసి ర్యాలీనీ తీసి గ్రాండ్ గా మూవీని లాంచ్ చేశారు.

అయితే, ఆర్జీవీ తాజాగా చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశమైంది. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరంటూ ఆనాటి కార్ల్ మార్క్స్ తెలుసుకున్నట్టే.. పిచ్చిపిచ్చి ప్రయత్నాలతో కొండా సినిమా షూటింగ్ ను ఆపలేరని నల్లబల్లి సుధాకర్ తెలుసుకోవాలి.. జై తెలంగాణ’’ అంటూ ట్వీట్ చేశారు.

 ట్వీట్ అంతా ఓకేగానీ.. అసలు ఎవరీ నల్లబల్లి సుధాకర్? ఆర్జీవీ ఎందుకు ఈ కామెంట్ చేశారు? అన్న దానిపైనే నెటిజన్లు ఇప్పుడు చెవులు కొరుక్కుంటున్నారు. కొందరు నెటిజన్లు ఓ తెలంగాణ మంత్రి పేరుతో రిప్లై ఇస్తున్నారు. సినిమా విషయంలో ఆ మంత్రిగారు ఆర్జీవీని బెదిరించినట్టు తెలుస్తోంది. అందుకే ఆ మంత్రిపేరును మార్చి ఇలా ఇన్ డైరెక్ట్ గా ట్వీట్ చేసినట్టు కామెంట్లు పెడుతున్నారు. మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలతో వ్యాపారం మొదలు పెట్టాడని మరికొందరు నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News