Telugudesam: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని పరిశీలించిన పీసీసీ ప్రతినిధి బృందం

AP PCC committee visits TDP Mangalagiri Office

  • టీడీపీ కార్యాలయంపై దుండగుల దాడి
  • పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఆదేశాల మేరకు కార్యాలయాన్ని సందర్శించిన కాంగ్రెస్ కమిటీ
  • చంద్రబాబును కలిసి విచారం వ్యక్తం చేసిన బృందం 

దుండగుల దాడిలో ధ్వంసమైన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని గత రాత్రి ఏపీ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి బృందం సందర్శించింది. వైసీపీ శ్రేణులుగా చెబుతున్న కొందరు నిన్న టీడీపీ కార్యాలయంతోపాటు విజయవాడలోని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నివాసంపై దాడిచేశారు. ఇంట్లోని సామగ్రిపై ప్రతాపం చూపి చిందరవందర చేశారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ ఆదేశాల మేరకు పీసీసీ కార్యదర్శి (అడ్మిన్ ఇన్‌చార్జ్) నూతలపాటి రవికాంత్, ప్రధాన కార్యదర్శి చిలకా విజయ్‌కుమార్‌, మైనార్టీ సెల్‌ జిల్లా చైర్మన్‌ షేక్‌ సలీం తదితరులు టీడీపీ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం చంద్రబాబును కలిసి మాట్లాడారు. దాడిపై విచారం వ్యక్తం చేశారు. కాగా, దాడికి నిరసనగా టీడీపీ నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది.

Telugudesam
TDP Office
Mangalagiri
Vijayawada
Andhra Pradesh
  • Loading...

More Telugu News