Telangana: తెలంగాణలో తాజాగా 202 మందికి కరోనా పాజిటివ్

Telangana covid bulletin

  • గత 24 గంటల్లో 46,808 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 52 కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,940 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 46,808 కరోనా పరీక్షలు నిర్వహించగా, 202 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 52 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 19, రంగారెడ్డి జిల్లాలో 18, నల్గొండ జిల్లాలో 16, వరంగల్ అర్బన్ జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 190 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,69,365 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 6,61,484 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,940 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,941కి పెరిగింది.

Telangana
COVID19
Media Report
Bulletin
  • Loading...

More Telugu News