Best CM: దేశంలో 'బెస్ట్ సీఎం'గా చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్
- రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఐఏఎన్ఎస్-సీఓటర్ సర్వే
- సెకండ్ బెస్ట్ సీఎంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి
- కేసీఆర్ కు తగ్గుతున్న పాప్యులారిటీ
దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ భగేల్ నిలిచారు. ఐఏఎన్ఎస్-సీఓటర్ నిర్వహించిన సర్వేలో ఆయన బెస్ట్ సీఎంగా నిలిచారు. 94 శాతం మంది ఆయన పాలన పట్ల తృప్తిని వ్యక్తపరిచారు. మొత్తం 115 పరామితుల ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సర్వేను నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఓటర్ వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ... సీఈవో తరహాలో పాలిస్తున్న ముఖ్యమంత్రులనే ప్రజలు ఇష్టపడుతున్నారని చెప్పారు. సర్వేలో రెండో బెస్ట్ సీఎంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాప్యులారిటీ బాగా పడిపోతోందని యశ్వంత్ దేశ్ ముఖ్ తెలిపారు. కేసీఆర్ కు తగ్గుతున్న పాప్యులారిటీ... తెలంగాణలో బీజేపీ బలోపేతం కావడానికి దోహదపడే అవకాశం ఉందని అన్నారు. 28.1 శాతం మంది ఉత్తరప్రదేశ్ సీఎం యోగిపై వ్యతిరేకతను వ్యక్తం చేశారని చెప్పారు.