Akhilesh Yadav: బాక్సాఫీస్ దగ్గర 'బ్యాచ్ లర్' దూకుడు!

Most Eligible Bachelor movie update

  • ఈ నెల 15వ తేదీన థియేటర్లకు 
  • రెండు రోజుల్లో 18 కోట్ల గ్రాస్ 
  • తగ్గని వసూళ్ల జోరు 
  • అక్కినేని బ్రదర్స్ కి హిట్లు  

అఖిల్ మొత్తానికి ఒక హిట్ కొట్టేశాడు.. తన కెరియర్ ను మొదలుపెట్టిన ఇంతకాలానికి సరైన హిట్ కొట్టాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఆయన చేసిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' బాక్సాఫీస్ దగ్గర తన దూకుడు చూపుతోంది. దసరా కానుకగా ఈ నెల 15వ తేదీన విడుదలైన ఈ సినిమా, తొలిరోజున తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకుంది.

ప్రపంచవ్యాప్తంగా తొలి రెండు రోజులలో 18 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, మూడో రోజునాటికి 24 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టినట్టుగా చెబుతున్నారు. నైజామ్ నుంచి వచ్చే వసూళ్లు ఒక రేంజ్ లో ఉన్నాయని అంటున్నారు. పండగ తరువాత కూడా వసూళ్ల జోరు తగ్గకపోవడం విశేషం.  

ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన బన్నీవాసు మాట్లాడుతూ, ఇంతటి విజయానికి 'బొమ్మరిల్లు' భాస్కర్ కథాబలం కారణమని చెప్పడం విశేషం. మొత్తానికి చాలా తక్కువ గ్యాప్ లో 'లవ్ స్టోరీ'తో చైతూ .. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' అఖిల్ హిట్ కొట్టడం, నాగ్ తో పాటు ఆయన అభిమానులందరినీ ఖుషీ చేసే విషయమే.

Akhilesh Yadav
Pooja Hegde
Bhaskar
  • Loading...

More Telugu News