Vishal: విశాల్ హీరోగా 'లాఠీ' .. టైటిల్ టీజర్ రిలీజ్!

Vishal Laatti movie teaser reales

  • పోలీస్ ఆఫీసర్ పాత్రలో విశాల్
  • కెరియర్ పరంగా 32వ సినిమా
  • కథానాయికగా సునైన
  • దర్శకుడిగా వినోద్ కుమార్  

తమిళనాట మాస్ యాక్షన్ హీరోగా విశాల్ కి మంచి క్రేజ్ ఉంది. తెలుగులోను ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది .. అందుకు తగిన మార్కెట్ కూడా ఉంది. తన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోను విడుదలయ్యేలా విశాల్ చూసుకుంటాడు. అలా ఆయన తాజా చిత్రం కూడా తెలుగులో విడుదల కానుంది.

తెలుగులో ఈ సినిమాకి 'లాఠీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. కొంతసేపటి క్రితం టైటిల్ పోస్టర్ తో పాటు టైటిల్ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనీ, ఆయన పాత్ర పేరు మురళీకృష్ణ అని ఈ టీజర్ ద్వారా రివీల్ చేశారు. ఈ సినిమాలో ఆయన జోడీగా సునైన కనిపించనుంది.

రమణ - నంద నిర్మిస్తున్న ఈ సినిమాకి, వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో విశాల్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. అలాగే ఈ సినిమా కూడా అదే దారిలో నడుస్తుందేమో చూడాలి. ఇక నుంచి ఈ సినిమాకి సంబంధించిన ఒక్కో అప్ డేట్ రానుంది. 

Vishal
Sunaina
Vinod Kumar
  • Error fetching data: Network response was not ok

More Telugu News