Petrol: హైదరాబాద్ లో రూ.110.. విజయవాడలో రూ.112.. మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

Petrol Prices In Hyderabad Crosses Rs 110 Mark

  • పెట్రోల్ పై 38 పైసల పెంపు
  • డీజిల్ పై 37 పైసలు పెరుగుదల
  • అన్ని రాజధానుల్లో సెంచరీ కొట్టేసిన పెట్రోల్

పెట్రోల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. విరామం లేకుండా రోజూ పెరుగుతున్న రేట్లతో సగటు వాహనదారుడు ఆందోళన చెందుతున్నాడు. ఇవాళ మళ్లీ పెట్రోలు మీద 37 పైసలు, డీజిల్ పై 38 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.110 దాటేసింది. ఏపీలోని విజయవాడ, గుంటూరుల్లో రూ.112.38గా ఉంది. అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ లీటర్ పెట్రోల్ ధర సెంచరీ మార్కును క్రాస్ చేసేసింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.77గా ఉండగా.. ఢిల్లీలో రూ.105.84గా ఉంది.

ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ధరలు ఇలా...

  • హైదరాబాద్: పెట్రోల్ – రూ.110.09, డీజిల్ – రూ.103.18
  • విజయవాడ: పెట్రోల్ – రూ.112.38, డీజిల్ – రూ.104.83
  • గుంటూరు: పెట్రోల్ – రూ.112.38, డీజిల్ – రూ.104.83
  • విశాఖపట్నం: పెట్రోల్ – రూ.110.90, డీజిల్ – రూ.103.43
  • ఢిల్లీ: పెట్రోల్ – రూ.105.84, డీజిల్ – రూ.94.57
  • ముంబై: పెట్రోల్ – రూ.111.77, డీజిల్ – రూ.102.52
  • చెన్నై: పెట్రోల్ – రూ.103.01, డీజిల్ – రూ.98.92
  • బెంగళూరు: పెట్రోల్ – రూ.109.53, డీజిల్ – రూ.100.37

Petrol
Diesel
Fuel
Prices
  • Loading...

More Telugu News