Suhas: అల్లు అరవింద్ క్లాప్ తో మొదలైన 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' 

Suhas new movie update

  • హీరోగా 'కలర్ ఫొటో' ఫేమ్ సుహాస్ 
  • దర్శకుడిగా దుష్యంత్ కటికనేని పరిచయం 
  • గౌరవ దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి 

ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండగా వచ్చి .. చిన్న చిన్న పాత్రలు చేస్తూ, హీరోగా ఎదిగినవారి జాబితాలో సుహాస్ కూడా ఈ మధ్యనే చేరిపోయాడు. ఆయన హీరోగా వచ్చిన 'కలర్ ఫోటో' అనూహ్యమైన విజయాన్ని సాధించింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది.

అప్పటి నుంచి కూడా సుహాస్ కి అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ ఆయన తొందరపడకుండా తనకి నచ్చే కథ కోసం వెయిట్ చేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే దుష్యంత్ కటికనేని ఆయనకి ఒక కథ చెప్పడం, అది నచ్చగానే ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయి. ఆ సినిమా పేరే 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'.

స్వేచ్ఛ క్రియేషన్స్ - మహా క్రియేషన్స్ తో కలిసి గీతా ఆర్ట్స్ 2 వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రోజున హైదరాబాద్ ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో ఈ సినిమా పూజ కార్యక్రమాలను జరుపుకుంది. అల్లు అరవింద్ క్లాప్ తో .. వంశీ పైడిపల్లి  గౌరవ దర్శకత్వంలో లాంఛనంగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

Suhas
Dushyanth
Allu Aravind
  • Loading...

More Telugu News