Malladi Vishnu: యాత్రల పేరుతో ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారు: మల్లాది విష్ణు

Chandrababu cheated women says Malladi Vishnu

  • టీడీపీ నేతలు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారు
  • చంద్రబాబు హయాంలో రూ. 2 లక్షల కోట్లు అప్పు చేశారు
  • జగన్ అవినీతి రహిత పాలన అందిస్తున్నారు

టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో మహిళలను చంద్రబాబు మోసం చేశారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పోలవరం, మలేషియా, సింగపూర్ యాత్రల పేరుతో ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారని చెప్పారు. తెలుగుదేశం హయాంలో రూ. 2 లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు.

ముఖ్యమంత్రి జగన్ అవినీతి రహిత, పారదర్శకమైన పాలనను అందిస్తున్నారని చెప్పారు. అమ్మఒడి పథకం గురించి టీడీపీ నేత అచ్చెన్నాయుడు అబద్ధాలు చెపుతున్నారని... ఆయనకు మాట్లాడే నైతిక హక్కు కూడా లేదని అన్నారు. వైయస్సార్ ఆసరా పథకం రెండు విడతలకు సంబంధించి రూ. 60 కోట్లు మహిళల ఖాతాలో జమ చేశామని చెప్పారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని 58, 59, 60వ డివిజన్ కు సంబంధించి ఈరోజు ఆసరా చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కరిమున్నీసా, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి హాజరయ్యారు.

Malladi Vishnu
Jagan
YSRCP
Chandrababu
Atchannaidu
Telugudesam
  • Loading...

More Telugu News