Sasikala: జయలలిత సమాధి వద్ద కంటతడి పెట్టిన శశికళ

Sasikala gets emotional

  • జయకు నివాళి అర్పిస్తూ భావోద్వేగానికి గురైన శశికళ
  • వందలాది మందితో భారీ ర్యాలీగా వచ్చిన వైనం   
  • శశికళ వాహనంపై అన్నాడీఎంకే పార్టీ జెండా

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి శశికళ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈరోజు ఆమె చెన్నై, మెరీనా బీచ్ లోని జయలలిత, ఎంజీఆర్ స్మారకాల వద్దకు   వందలాది మంది అనుచరులతో భారీ ర్యాలీగా చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జయలలిత సమాధి వద్ద ఆమె భావోద్వేగంతో కంటతడి పెట్టారు. జయకు నివాళి అర్పించిన శశికళ... కన్నీళ్లను తుడుచుకుంటూ పుష్పాంజలి ఘటించారు.

  ఆమె ప్రయాణించిన వాహనంపై అన్నాడీఎంకే జెండా ఉంది. దీనిపై అన్నాడీఎంకే నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వ్యక్తి పార్టీ జెండాను ఎలా పెట్టుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు.

Sasikala
Jayalalitha
Tributes
Emotional
  • Loading...

More Telugu News