Banjara Hills: హైదరాబాద్‌లోని నీలోఫర్ కేఫ్.. ఇక్కడ కప్పు టీ రూ. 1000

Niloufer Cafe presents a cup of tea for Rs 1000

  • బంజారాహిల్స్‌లోని నీలోఫర్ కేఫ్‌లో అందుబాటులోకి
  • అసోంలో నిర్వహించిన వేలంలో కిలో పౌడర్‌ను రూ. 75 వేలకు దక్కించుకున్న కేఫ్
  • గోల్డెన్ టిప్స్ బ్లాక్ టీ పొడితో అరుదైన రుచి
  • ఆస్వాదించేందుకు క్యూ కడుతున్న వినియోగదారులు

హైదరాబాద్ నీలోఫర్ కేఫ్‌లో కప్పు టీని వెయ్యి రూపాయలకు విక్రయిస్తున్న వార్త ఇప్పుడు ఆ నోటా, ఈ నోటా పడి అందరికీ చేరింది. దీంతో అందులో అంత స్పెషల్ ఏముందా అంటూ టేస్ట్ చేసేందుకు అటువైపు దారితీస్తున్నారు. బంజారాహిల్స్‌లో తాజాగా ప్రారంభించిన ఈ కేఫ్‌ బ్రాంచ్ అత్యంత అరుదైన, ప్రత్యేకమైన ఈ టీని నగరవాసులకు పరిచయం చేసింది. ఈ తేనీటిని గోల్డెన్ టిప్స్ బ్లాక్ టీ పొడితో తయారుచేస్తారట. అందుకే దానికి అంత ధర!

అసోంలోని మైజాన్‌లో నిర్వహించిన వేలంలో కిలో టీ పొడిని రూ. 75 వేల చొప్పున కొనుగోలు చేసి తీసుకొచ్చారు. ఇంకా కేఫ్ దగ్గర మిగిలింది కేజిన్నర గోల్డెన్ టిప్స్ బ్లాక్ టీ పౌడర్ మాత్రమే. ఈ పౌడర్‌తో తయారుచేసే టీ ప్రత్యేకమైన, అరుదైన రుచిని ఇస్తుంది. వినియోగదారులకు ఈ సరికొత్త రుచిని అందించాలన్న ఉద్దేశంతోనే దీనిని పరిచయం చేసినట్టు నీలోఫర్ కేఫ్ యాజమాన్యం పేర్కొంది.

కాగా, నీలోఫర్ దీంతోపాటు సిల్వర్ నీడిల్ వైట్ టీ, సౌత్ ఆఫ్రికన్ రూయిబోస్, మొరాకన్ మింట్, జపనీస్ సెంచా వంటి టీలను రూ. 300కు విక్రయిస్తోంది. టేస్ట్ చూడాలనుకున్న వారు అటువైపు ఓ లుక్కేస్తే సరి.

Banjara Hills
Niloufer Cafe
Tea
Golden Tips Black Tea
  • Loading...

More Telugu News