Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బంపరాఫర్!

Hyderabad metro announce offers to its passengers
  • ట్రిప్ పాసుల్లో రాయితీలు
  • 20 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి 30 సార్లు ప్రయాణించొచ్చు
  • జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గంలో చార్జీ తగ్గింపు
  • ఈ నెల 18 నుంచి జనవరి 15 వరకు ఆఫర్
నిత్యం మెట్రో రైలులో ప్రయాణించే వారి కోసం హైదరాబాద్ ఎల్ అండ్ టీ మెట్రో పండుగ ఆఫర్లు ప్రకటించింది. ‘మెట్రో సువర్ణ ఆఫర్ 2021’ పేరుతో ఈ నెల 18 నుంచి జనవరి 15 మధ్య ట్రిప్ పాసుల్లో పలు రాయితీలు ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 20 ప్రయాణాలకు డబ్బులు చెల్లించి 30 సార్లు ప్రయాణించవచ్చు. అయితే, ఈ అవకాశాన్ని 45 రోజుల్లోపు వినియోగించుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న మెట్రో కార్డుపైనే ఈ ఆఫర్‌ను పొందొచ్చు. అలాగే, జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గంలో ప్రస్తుతం 10 కిలోమీటర్ల దూరానికి రూ.35 వసూలు చేస్తుండగా, ఇకపై దీనిని రూ. 15కి తగ్గించారు. అయితే, ఇది పూర్తిస్థాయి తగ్గింపు కాదు. పైన పేర్కొన్న రోజుల్లో మాత్రమే వర్తిస్తుంది.

నెలలో 20 సార్లు కంటే ఎక్కువ సార్లు ప్రయాణించే వారి కోసం ప్రతి నెలా లక్కీడ్రా తీసి ఐదుగురు విజేతలను ఎంపిక చేస్తారు. లక్కీ డ్రా కోసం వీరు తమ కార్డును టీ-సవారి, లేదంటే మెట్రో స్టేషన్లలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని హైదరాబాద్ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు.
Hyderabad Metro
Offers
L&T Metro
Trip Pass

More Telugu News