Ramakrishna: మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) మృతి

Maoist top leader Ramakrishna dead

  • బీజాపూర్ అడవుల్లో అనారోగ్యంతో మృతి
  • బుల్లెట్ గాయం కారణంగా అనారోగ్యానికి గురైన ఆర్కే
  • ఎన్నో ఎన్ కౌంటర్ల నుంచి తప్పించుకున్న ఆర్కే

మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) మృతి చెందారు. బీజాపూర్ అడవుల్లో ఆయన చనిపోయారు. అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. ఆర్కే చనిపోయినట్టు బస్తర్ పోలీసులు తెలిపారు. ఆయన అసలు పేరు అక్కిరాజు హరగోపాల్. విప్లవోద్యమంలో ఆయనది తిరుగులేని పాత్ర. నేపాల్ నుంచి దక్షిణ భారతం వరకు ఆయనకు గొప్ప విప్లవ నేతగా గుర్తింపు ఉంది.

వైయస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వంతో చర్చలు జరిపిన మావోయిస్టు బృందానికి ఆయన నాయకత్వం వహించారు. రామకృష్ణపై రూ. 20 లక్షల రివార్డు ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై దాడి కేసులో కూడా ఆర్కే నిందితుడిగా ఉన్నారు.

పలు ఎన్ కౌంటర్ల నుంచి తప్పించుకున్న ఆర్కేకు.. నాలుగేళ్ల క్రితం బలిమెలలో జరిగిన ఎన్ కౌంటర్ లో బుల్లెట్ గాయమయింది. అదే ఎన్ కౌంటర్ లో ఆయన కుమారుడు మృతి చెందాడు. బుల్లెట్ గాయమైనప్పటి నుంచి ఆర్కే అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆర్కే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. మరోవైపు ఆర్కే మృతిపై సమాచారం లేదని విరసం నేత కల్యాణరావు తెలిపారు.

  • Loading...

More Telugu News