Santhosh Shobhan: 'మంచిరోజులు వచ్చాయి' నుంచి ట్రైలర్ రిలీజ్!

Manchi Rojulu Vachhayi trailer released

  • సంతోష్  శోభన్ జోడీగా మెహ్రీన్
  • మారుతి మార్కు కామెడీ
  • ముఖ్యమైన పాత్రలో వెన్నెల కిశోర్  
  • వచ్చేనెల 4వ తేదీన విడుదల  

మారుతి సినిమాల్లో మంచి డ్రామా ఉంటుంది. కామెడీని కలుపుకుని సన్నివేశాలు తెరపై పరుగులు తీస్తుంటాయి. సంతోష్ శోభన్ - మెహ్రీన్ జంటగా ఆయన 'మంచి రోజులు వచ్చాయి' అనే సినిమాను రూపొందించాడు. లాక్  డౌన్ సమయంలో ఆయన చిన్నపాటి కథను అనుకుని .. అల్లుకుని చకచకా లాగించేసిన  సినిమా ఇది.

దసరా పండగ సందర్భాన్ని పురస్కరించుకుని కొంత సేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. తన కూతురు ప్రేమలో పడిందనే డౌట్ వచ్చిన ఒక తండ్రి అందుకు అడ్డుపడుతుండటం, అది తట్టుకోలేకపోయిన ఆ లవర్ అతగాడి తిక్క కుదిర్చే పనులు చేయడమనేది ఈ ట్రైలర్లో చూపించారు.

ఈ సినిమా అంతా కూడా లవ్ .. కామెడీ పాళ్లను రంగరించినట్టుగా కనిపిస్తూ, మారుతి మార్కుతో సాగుతోంది. హీరోయిన్ తండ్రి పాత్రలో అజయ్ ఘోష్ కి మంచి పాత్ర పడిందనే అనిపిస్తోంది. ఇక వెన్నెల కిషోర్ .. శ్రీనివాస రెడ్డి ఇద్దరూ కూడా నవ్వుల్లో తమ వాటాలను తాము పంచారు. దీపావళి కానుకగా వచ్చేనెల 4వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News